ఆచంట మండలంలో టీడీపీ, జనసేన ఒప్పందం.. ఎంపీపీ, ఉప ఎంపీపీ పదవుల కైవసం
- టీడీపీకి ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన అంగీకారం
- జనసేనకు ఉప ఎంపీపీ పదవి ఇచ్చేందుకు ఒప్పుకున్న టీడీపీ
- ఆచంటలో ఎంపీపీ పదవి దక్కించుకోలేకపోయిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెల్లడైన విషయం తెలిసిందే. ఇక ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. టీడీపీకి ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన అంగీకరించగా, జనసేనకు ఉప ఎంపీపీ పదవి ఇచ్చేందుకు టీడీపీ ఒప్పుకుంది.
ఆచంటలో ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీడీపీకి చెందిన ఏడుగురు గెలుపొందారు. అలాగే, వైసీపీకి చెందిన ఆరుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. చివరకు టీడీపీ, జనసేన ఒప్పందం కుదుర్చుకుని ఎంపీపీ, ఉప ఎంపీపీ పదవులను దక్కించుకున్నాయి.