మాకు సభలో ప్రాధాన్యం ఇవ్వండి.. ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్
- అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ భేటీ
- హాజరైన ఉత్తమ్, పార్టీ ఎమ్మెల్యేలు
- సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని డిమాండ్
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీసే ఎత్తుగడలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సమావేశమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజుల పాటు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితబంధు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన, ధరణిలో సమస్యలు, పోడు భూముల వ్యవహారంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ కు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇటీవల మరణించిన పలువురు నేతలకు నివాళులు అర్పించిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.