'నయట్టు' తెలుగు రీమేక్ గా 'బ్రాకెట్'!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'నయట్టు'
  • తెలుగు టైటిల్ గా 'బ్రాకెట్'
  • నవంబర్ నుంచి సెట్స్ పైకి
  • ప్రధానమైన పాత్రలో అంజలి
అల్లు అరవింద్ కి నిర్మాతగా ఉన్న అనుభవాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఎప్పటికప్పుడు ట్రెండును ఫాలో అవుతూ .. ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ కి కట్టుబడి నడిచే కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడాన్ని ఆయన గమనించారు.

అందువల్లనే ఆ తరహా కథలను తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో విడుదలై విజయవంతమైన 'నయట్టు' సినిమాను, ఆయన తెలుగులో రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాకి ఆయన 'బ్రాకెట్' అనే టైటిల్ ను ఖరారు చేసి .. రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. 'శ్రీదేవి సోడా సెంటర్' దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అంజలి .. రావు రమేశ్ .. సత్యదేవ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని చెబుతున్నారు.


More Telugu News