తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సోమవారానికి వాయిదా
- ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులు
- శాసనసభలో స్పీకర్ పోచారం సంతాప తీర్మానం
- హామీల అమలు గురించి నిలదీయనున్న ప్రతిపక్షాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులర్పిస్తూ శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జికి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌కు, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షంకు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణరావుకు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథానికి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
అనంతరం శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, దళితబంధు వంటి పలు పథకాలను సభ ముందుంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి.