ఎస్సార్‌నగర్‌లో ఇద్దరు వృద్ధ మహిళల కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
- బాధితుల పేరుపై అమీర్‌పేటలో కోట్ల రూపాయల ఆస్తి
- ఆస్తి కోసమే కిడ్నాప్ అని అనుమానం
- అమీన్‌పూర్‌లో బాధితులను బంధించిన నిందితులు
- కేకలు విని పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎస్సార్ నగర్ ఒకటి. ఇక్కడ నిన్న ఇద్దరు వృద్ధ మహిళలను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కలకలం రేపింది. వారి పేరుపై అమీర్‌పేటలో కోట్ల రూపాయల ఆస్తి ఉండడమే కిడ్నాప్‌కు కారణంగా తెలుస్తోంది. బాధిత మహిళలను అపహరించి తీసుకెళ్లిన దుండగులు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. వారి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధులు ఇద్దరినీ రక్షించారు. నిందితులపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, బాధిత మహిళలు మాట్లాడుతూ.. తమను కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లోని భూమి పత్రాలతోపాటు బంగారాన్ని కూడా దోచుకున్నారని ఆరోపించారు. మిరాజ్ అనే వ్యక్తే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.