యూజర్ల భద్రత కోసం ఐదేళ్లలో 13 బిలియన్ డాలర్ల ఖర్చు: ఫేస్‌బుక్
- 2016 నుంచి భద్రతపై సోషల్ మీడియా దిగ్గజం ఫోకస్
- ఐదేళ్ల క్రితం ఈ విభాగంలో 10 వేల మంది ఉద్యోగులు
- ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 40 వేలపైనే అన్న ఫేస్‌బుక్
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్. అయితే దీనిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయని, వీటి గురించి ఆ సంస్థకు చెప్పినా పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఫేస్‌బుక్ సంస్థ స్పందించింది. యూజర్ల భద్రత, సంతృప్తి కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని చెప్పింది. అలాగే భద్రత, రక్షణ కోసం 2016 నుంచి భారీగా పెట్టుబడులు పెట్టామని తెలిపింది.
ఈ విభాగాల్లో ఐదేళ్ల కాలంలో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామని వెల్లడించింది. తమ కంపెనీలో ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను కూడా భారీగా పెంచామని తెలిపింది. ఐదేళ్ల క్రితం ఈ విభాగాల్లో 10 వేల మంది ఉద్యోగుల వరకూ పనిచేసే వారని చెప్పిన ఈ సంస్థ.. ప్రస్తుతం భద్రత, రక్షణ విభాగంలో 40 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది.
ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పలు సమస్యలున్నాయని, వీటి గురించి కంపెనీకి ఎన్నిసార్లు నివేదించినా పట్టించుకోవడం లేదని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. వీటిపైనే ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది. తాము ఎప్పుడూ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తామని తెలిపింది.