రాష్ట్రాలు సుముఖంగా లేవు.. పెట్రోలు ధరలు తగ్గే అవకాశం లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

  • పెట్రోల్ ధరలు తగ్గాలని కేంద్రం కూడా కోరుకుంటోంది
  • పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవు
  • లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వస్తున్న వాటా రూ. 32 మాత్రమే
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని... అందువల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పెట్రోల్ ధరలు తగ్గాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటోందని... కానీ రాష్ట్రాల తీరు వల్ల ధరలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని అన్నారు. లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వస్తున్న వాటా రూ. 32 అని తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 19 డాలర్లుగా ఉన్నప్పుడు రూ. 32 పన్ను వసూలు చేశామని... ఇప్పుడు బ్యారెల్ ధర 75 డాలర్లుగా ఉన్నప్పుడు కూడా అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు. కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News