నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు రెండే: చైతూ
- 'లవ్ స్టోరీ'పై మంచి అంచనాలు ఉన్నాయి
- బుకింగ్స్ మంచి జోరుమీద జరుగుతున్నాయి
- ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే నమ్మకం ఉంది
- క్లైమాక్స్ బాగా రావడం కోసం అలా చేశాం
నాగచైతన్య కథానాయకుడిగా .. సాయిపల్లవి కథానాయికగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చైతూ ఈ సినిమాను గురించి మాట్లాడాడు.
"ఈ సినిమాను నేను ఒప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి శేఖర్ కమ్ముల అయితే రెండవది కంటెంట్. ఈ రెండింటిపై నమ్మకంతోనే నేను ఈ సినిమా చేశాను. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. మంచి కంటెంట్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారనే నమ్మకమైతే ఉంది. మొదటి మూడురోజులైతే బుకింగ్స్ బాగున్నాయి.
ఈ సినిమాలో నేను డాన్స్ మాస్టర్ గా కనిపిస్తాను .. నా నుంచి అనుకున్న అవుట్ పుట్ వచ్చేంతవరకూ శేఖర్ మాస్టర్ చాలా ఓపికతో ఉన్నారు. ఈ సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు తీసినట్టు చెప్పుకుంటున్నారు. అందులో నిజం లేదు. ఒకే క్లైమాక్స్ ను మరింత బెటర్ గా తీసే ప్రయత్నం చేశాము అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.