వార్నర్ డకౌట్ అవడంపై కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్
- ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన వార్నర్
- నార్ట్జీ, రబాడ ఇద్దరికీ వార్నర్‌కు ఎలా బంతులేయాలో తెలుసు
- సున్నాకే అవుటవడం ఆశ్చర్యం కలిగించలేదన్న మాజీ క్రికెటర్
తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 రెండో సెషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఢిల్లీ బౌలర్ నార్ట్జీ వేసిన బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. వార్నర్ ఇలా అవుటవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వార్నర్ ఇలా డకౌట్ అవడం తనకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని కేపీ చెప్పాడు. వార్నర్ అవుటవడంపై స్పందించిన కేపీ.. వార్నర్ బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడే ఈ విషయం ఆలోచించి ఉంటాడని అన్నాడు. ‘‘పంజాబ్ లేదా రాజస్థాన్ జట్లయితే పర్లేదు కానీ ఢిల్లీనా? అదీ నార్ట్జీ, రబాడ? వీళ్లొద్దురా బాబు’’ అని వార్నర్ అనుకొని ఉంటాడని కేపీ అన్నాడు.
ఢిల్లీ జట్టులో ఉన్న ఈ ఇద్దరు బౌలర్లకు వార్నర్‌కు ఎలాంటి బంతులు వేయాలో చాలా బాగా తెలుసని కేపీ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నార్ట్జీ కేవలం 12 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వీటిలో వార్నర్ వికెట్ కూడా ఒకటి. మరో బౌలర్ రబాడ మూడు వికెట్లు కూల్చాడు. బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో సన్‌రైజర్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఢిల్లీకి నిర్దేశించగలిగింది. 136 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు.