టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు

  • చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన హనుమంతరావు
  • పార్టీలో ప్రాధాన్యత లభించలేదని లేఖలో పేర్కొన్న వైనం
  • గత ఏడాదిగా పార్టీకి దూరంగా ఉన్నానన్న హనుమంతరావు
ఏపీలో టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని తన రాజీనామా లేఖలో హనుమంతరావు పేర్కొన్నారు. తన సేవలను పార్టీ ఉపయోగించుకోవడం లేదని చెప్పారు. గత ఏడాది నుంచి తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఆప్కో అభివృద్ధి కోసమే తాను టీడీపీలోకి వచ్చానని.. అయితే ఆప్కో అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా సహకరించలేదని చెప్పారు. 1999, 2004 ఎన్నికల్లో హనుమంతరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు.


More Telugu News