కరోనా కట్టడికి బూస్టర్ డోసు అవసరాన్ని గుర్తించాం: అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌

  • అమెరికాలో పంపిణీకి  ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాం
  • పేద దేశాల‌కు 500 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల‌ను కూడా అందిస్తాం
  • కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు  ధనిక దేశాలు స‌హ‌క‌రించాలి
  • వ్యాక్సిన్‌తో పాటు కరోనా వైద్య సాయానికి ముందుకు రావాలి
త‌మ దేశంలో కరోనా కట్టడికి బూస్టర్ డోసు అవసరాన్ని గుర్తించామని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించామని ఆయ‌న చెప్పారు. అయిన‌ప్ప‌టికీ పేద దేశాల‌కు 500 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల‌ను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని జో బైడెన్ ప్ర‌క‌టించారు.

ఓ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు ధనిక దేశాలు కరోనా వ్యాక్సిన్‌తో పాటు కరోనా వైద్య సాయానికి ముందుకు రావాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. వైద్య సదుపాయాల కొర‌త‌తో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న దేశాలకు సాయం అందించాల్సి ఉంద‌ని తెలిపారు.

వచ్చే ఏడాది సెప్టెంబరులోపు ప్రపంచంలోని 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ వ‌ర్చువ‌ల్ సమావేశంలో జపాన్ ప్రధాని యోషిహిడే సుగా కూడా పాల్గొని మాట్లాడారు. జ‌పాన్ నుంచి 60 మిలియన్ల టీకాల‌ను ఇత‌ర దేశాల‌కు పంపిణీ చేసేందుకు సిద్ధమ‌ని చెప్పారు.


More Telugu News