హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్

  • బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేయాలి
  • ఓడిపోతే రాజకీయాల నుంచే కాదు, హిందూపురం నుంచే వెళ్లిపోతా
  • చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడారు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సవాల్ విసిరారు. బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి తనతో పోటీపడాలని అన్నారు. తాను కనుక ఓడిపోతే రాజకీయాలే కాకుండా హిందూపురాన్ని కూడా వదిలి వెళ్లిపోతానని అన్నారు. పట్టణంలో నిన్న తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలకృష్ణకు ఈ సవాలు విసిరారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపైనా ఇక్బాల్ తీవ్ర విమర్శలు చేశారు. వరుస ఓటములతో టీడీపీ కుదేలవుతోందన్నారు. ప్రజల్లో అభాసుపాలు అవుతామన్న భయంతోనే చంద్రబాబు పరిషత్ ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. టీడీపీ కుప్పం నుంచి హిందూపురం వరకు అన్ని చోట్లా ఓడిపోయిందన్న ఇక్బాల్, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన టీడీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని ఇక్బాల్ మండిపడ్డారు.


More Telugu News