తేలిపోయిన సన్‌రైజర్స్ బ్యాటింగ్.. ఢిల్లీ ముందు స్వల్ప లక్ష్యం
- పోరాడిన అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్
- మూడు వికెట్లు కూల్చిన కగిసో రబాడ
- ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన వార్నర్
రబాడ ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విలవిల్లాడింది. అతనికి నార్ట్జీ, అక్షర్ పటేల్ సహకారం అందించడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ వెలవెలబోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు శుభారంభం లభించలేదు. భారీ అంచనాలున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18), కెప్టెన్ విలియమ్సన్ (18), మనీష్ పాండే (17) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.
కేదార్ జాదవ్ (3), జేసన్ హోల్డర్ (10) కూడా నిరాశపరిచారు. అయితే అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22) పోరాడటంతో హైదరాబాద్ జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. చివర్లో రషీద్ ఖాన్ వేగంగా ఆడటంతో 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ జట్టు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబాడకు 3, అక్షర్ పటేల్ 2, ఆన్రిచ్ నార్ట్జీ 2 వికెట్లు తీసుకున్నారు.
135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిలకడగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. ధవన్ (22 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (6) క్రీజులో ఉన్నారు. పృథ్వీ షా (11) అవుటయ్యాడు.