దిగొచ్చిన బ్రిటన్.. కొవిషీల్డ్‌కు గుర్తింపునిస్తూ తాజా ప్రకటన
- యూకే గుర్తింపు లభించిన నాలుగు వ్యాక్సిన్లలో కొవిషీల్డ్
- యూకే రావడానికి 14 రోజుల ముందుగా రెండు డోసులు తీసుకోవాలి
- వేరు వేరు వ్యాక్సిన్ డోసులు కూడా తీసుకోవచ్చు
బ్రిటన్ ప్రయాణాలపై ఇటీవల విడుదల చేసిన నిబంధనలపై భారత్‌లో ఆగ్రహావేశాలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. యూకేకే చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కూడా బ్రిటన్ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం వివాదానికి తెరలేపింది. దీనిపై శశిథరూర్ వంటి ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదని భారత విదేశాంగ శాఖ కూడా హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వం దిగొచ్చింది.
తమ ప్రకటనను సవరించి కొత్తగా మరో ప్రకటన చేసింది. దానిలో కొవిషీల్డ్‌కు యూకే గుర్తింపు లభించినట్లు పేర్కొంది. మొత్తమ్మీద నాలుగు వ్యాక్సిన్లకు యూకే గుర్తింపు లభించినట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు చేసిన ప్రకటనలో ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా, ఫైజర్ బయాన్‌టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు మాత్రమే గుర్తింపు ఇచ్చిన యూకే ప్రభుత్వం తాజాగా మరో నాలుగు ఫార్ములేషన్లకు కూడా అనుమతినిచ్చింది. ఈ జాబితాలో ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాగ్జెవేరియా, మోడెర్నా టకేడా టీకాల ఫార్ములేషన్లకు చోటు దక్కింది.
అలాగే అక్టోబరు 4 వరకూ రెండు వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారిని కూడా దేశంలోకి అనుమతించనున్నట్లు యూకే తెలిపింది. అయితే కేవలం యూకే గుర్తింపు పొందిన వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ అనుమతులు లభించనున్నాయి. తాజా ప్రయాణ సడలింపులు అక్టోబరు 4 సోమవారం ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.