ఈ రోజు నేను మరిచిపోలేని రోజు: చిరంజీవి
- ఆగస్టు 22 నేను పుట్టినరోజు
- సెప్టెంబరు 22 నటుడిగా నేను పుట్టినరోజు
- కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు
- మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసిన రోజు
ఈ రోజు తాను మరిచిపోలేని రోజు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నటుడిగా తాను అప్పట్లో ఇదే రోజున సినీ పరిశ్రమలో తెలుగు ప్రజలకు పరిచయమయ్యానని ఆయన వివరించారు.
'ఆగస్టు 22 నేను పుట్టినరోజైతే సెప్టెంబరు 22 నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేని రోజు' అని చిరంజీవి తెలిపారు.
కాగా, చిరంజీవి నటించిన తొలి సినిమా 'పునాది రాళ్లు'. అయితే, దానికంటే ముందు 'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలైంది. 1978, సెప్టెంబర్ 22న ఆ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి వరుసగా సినిమాల్లో నటించారు.. మెగాస్టార్‌గా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు.