ఏపీలో తయారవుతోన్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారు: బొండా ఉమ తీవ్ర ఆరోపణలు
- పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే డ్రగ్స్ దందా కొనసాగుతోంది
- డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని డీఆర్ఐకి లేఖ రాస్తాం
- డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలి
- వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి
- నిన్న మంత్రి పేర్ని నాని ఎందుకు మీడియా సమావేశం పెట్టారు?
ఏపీలో హెరాయిన్ సరఫరా అవుతోందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర మంత్రి పేర్ని నాని నిన్న మండిపడ్డ విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బొండా ఉమ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే డ్రగ్స్ దందా కొనసాగుతోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై విచారణ జరిపించాలని కోరుతూ తాము డీఆర్ఐకి లేఖ రాస్తామని బొండా ఉమ అన్నారు. ఏపీలో తయారవుతోన్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి అవుతోందని ఆయన చెప్పారు.
అకస్మాత్తుగా నిన్న మంత్రి పేర్ని నాని ఎందుకు మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? దేశంలోకి వచ్చిన 70 వేల కోట్ల హెరాయిన్ ఎక్కడికి వెళ్లింది? ఎందుకు ఏపీ పోలీసులు విచారణ చేయట్లేదు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారు? అని బొండా ఉమ నిలదీశారు.