తెలంగాణలో నేడు భారీ.. రేపు ఓ మోస్తరు వర్షాలు
- పశ్చిమ బెంగాల్ తీరం వద్ద అల్పపీడనం
- 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం
- నల్గొండ జిల్లా దోమలపల్లిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా దోమలపల్లిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా ఖమ్మం జిల్లా రావినూతలలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్న కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని చిట్టుల్‌లో ఏకంగా 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.