పాకిస్థాన్ లో చరిత్ర సృష్టించిన హిందూ యువతి
- చరిత్ర సృష్టించిన సనా రాంచంద్ గుల్వానీ
- పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపిక
- తొలి అటెంప్ట్ లోనే సివిల్స్ కొట్టిన హిందూ యువతి
పాకిస్థాన్ లో హిందూ యువతి చరిత్ర సృష్టించారు. సనా రాంచంద్ గుల్వానీ పాక్ లో అత్యున్నత ఉద్యోగమైన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాన్ని తన తొలి అటెంప్ట్ లోనే ఆమె సాధించడం గమనార్హం. పాకిస్థాన్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో అత్యున్నత ఉద్యోగాల్లోకి మైనార్టీలు వెళ్లడం అత్యంత కష్టం.
ఈ సందర్భంగా సనా రాంచంద్ మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగు వేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. ఈ ఏడాది జరిగిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షల్లో దేశ వ్యాప్తంగా కేవలం 2 శాతం అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. మరోవైపు సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన ఆమె ఇప్పుడు పాకిస్థాన్ లోని హిందువులకు రోల్ మోడల్ గా మారారు.