భారత్ లోనూ హవానా సిండ్రోమ్?: టూర్ లో అమెరికా సీఐఏ అధికారికి అస్వస్థత!
- ఓ అధికారిలో లక్షణాలు కనిపించాయన్న సీఐఏ ప్రతినిధి
- అంతకుమించి వివరాలు చెప్పని అధికారి
- గత నెలలో కమలా హారిస్ వియత్నాం టూర్ ఆలస్యం
- 200 మంది అధికారులకు లక్షణాలు
ఇప్పటిదాకా వివిధ దేశాలకే పరిమితమైన హవానా సిండ్రోమ్.. ఇప్పుడు భారత్ లోకీ ఎంటరైందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) అధికారి. ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఓ అధికారికి హవానా సిండ్రోమ్ లక్షణాలు కనిపించాయని సీఐఏ ప్రతినిధి ఒకరు చెప్పారు. సీఐఏ అధిపతి విలియమ్ బర్న్స్ తో కలిసి ఆ అధికారి భారత్ కు వెళ్లారని చెప్పారు. అయితే, ఈ విషయం గురించి ఇంతకుమించి చెప్పేందుకు ఆ అధికారి నిరాకరించారు. లక్షణాలు కనిపించిన అధికారి వివరాలు కూడా ఆయన చెప్పలేదు.
గత నెలలో ఈ హవానా సిండ్రోమ్ వల్లే ఆమె వియత్నాం హనోయి పర్యటన మూడు గంటలు ఆలస్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 200 మంది అధికారులు, వారి కుటుంబ సభ్యుల్లో హవానా సిండ్రోమ్ లక్షణాలు కనిపించాయి.
ఏంటీ హవానా సిండ్రోమ్?
తొలిసారి 2016లో క్యూబాలోని అమెరికా ఎంబసీ అధికారులకు ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించాయి. ఈ అంతుచిక్కని వ్యాధిలో అకస్మాత్తుగా చెవుల్లో వింత శబ్దాలు వినిపించడం, వాంతులొచ్చినట్టు అనిపించడం, వాంతులు, నీరసం, తలనొప్పి, జ్ఞాపకశక్తి లోపించడం, కళ్లు తిరగడం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మెదడుకు గాయాలయ్యే ప్రమాదాలూ ఉంటాయి. రేడియో ఫ్రీక్వెన్సీ సూక్ష్మ తరంగాలను ఆయుధాలుగా మలచి రష్యానే ప్రయోగిస్తోందని, దాని వల్లే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆరోపిస్తోంది. 2017 నుంచే అమెరికా దీనిపై దర్యాప్తు చేస్తోంది.