చంద్రబాబుతో మాట్లాడడానికి జోగి రమేశ్‌కు ఉన్న అర్హత ఏంటీ?: బుద్ధా వెంకన్న
- చంద్రబాబు నాయుడితో జోగి రమేశ్ మాట్లాడేందుకు వచ్చారని ఎలా చెబుతారు?
- జడ్ ప్లస్ భద్రత ఉన్న నేతను అపాయింట్‌మెంట్ లేకుండా కలుస్తారా?
- డీఐజీ స్థాయి వ్యక్తి పోలీసు వ్యవస్థను కించపర్చేలా మాట్లాడారు
- తప్పు చేసే పోలీసులను కోర్టు బోనులో నిలబెడతాం
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, ఈ నేపథ్యంలోనే తాను నిరసన తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లానని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, పోలీసుల తీరుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడితో జోగి రమేశ్ మాట్లాడేందుకు వచ్చారని పోలీసులు ఎలా చెబుతారు? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబుతో మాట్లాడడానికి జోగి రమేశ్‌కు ఉన్న అర్హత ఏంటీ? అని ఆయన నిలదీశారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతను ఎవరైనా అపాయింట్‌మెంట్ లేకుండా కలుస్తారా? అని ప్రశ్నించారు. డీఐజీ స్థాయి వ్యక్తి పోలీసు వ్యవస్థను కించపర్చేలా మాట్లాడారని ఆయన అన్నారు. తప్పు చేసే పోలీసులను కోర్టు బోనులో నిలబెడతామని ఆయన హెచ్చరించారు.