నవంబర్ నుంచి 'ప్రాజెక్టు K' రెగ్యులర్ షూటింగ్!
- విడుదలకు సిద్ధమైన 'రాధే శ్యామ్'
- సెట్స్ పై 'సలార్' .. 'ఆదిపురుష్'
- 200 రోజులు కేటాయించిన ప్రభాస్
- కీలకపాత్రలో అమితాబ్
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' సినిమా సిద్ధమవుతోంది. 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఆ తరువాత సినిమాగా ఆయన ఒక వైపున 'సలార్'ను పూర్తిచేస్తూనే, మరో వైపున 'ఆది పురుష్' షూటింగులో పాల్గొంటున్నాడు. ఇక ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నాగ్ అశ్విన్ చకచకా చేసేస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా ట్రైల్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పది రోజుల పాటు నిర్వహించారు. ఈ షూటింగులో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు 'నవంబర్' నుంచి మొదలవుతుందనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ 200 రోజులను కేటాయించగా, ఆయన సరసన నాయికగా దీపిక పదుకొణే అలరించనుంది.