హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుమ్మేసిన వర్షం.. బహదూర్‌పుర-రామ్నాస్‌పుర మధ్య నిలిచిన రాకపోకలు
- భారీ వర్షానికి నగరం అతలాకుతలం
- నీటమునిగిన నెహ్రూ జూలాజికల్ పార్క్
- బహదూర్‌పురలో వరదనీటిలో మునిగిన వారిని తాళ్ల సాయంతో రక్షించిన స్థానికులు
- రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం
వాతావరణశాఖ హెచ్చరించినట్టే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలు భారీ వర్షం కురిపించాయి. ఒకటి రెండు గంటల్లోనే పలు ప్రాంతాలను జలమయం చేశాయి. బహదూర్‌పుర పరిధిలోని చందూలాల్ బారాదరి, నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.
బహదూర్‌పుర, రామ్నాస్‌పుర మధ్య నాలా ఉద్ధృతంగా పొంగి ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. పలు ప్రాంతాల్లో నీటిలో బైక్‌లు కొట్టుకుపోయాయి. బహదూర్‌పురాలో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని స్థానికులు బోట్లు, తాళ్ల సాయంతో రక్షించారు. చందూలాల్ బారాదరిలో రికార్డు స్థాయిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ నెలలో ఒక్క రోజులో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మెదక్ జిల్లాలోని చిట్కుల్‌లో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌లో అత్యల్పంగా 9 సెంటీమీటర్ల వాన కురిసింది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.