నేటి ఐపీఎల్ మ్యాచ్ లో నిరాశపరిచిన ఆంధ్రా ఆటగాడు

  • ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ బెంగళూరు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • వన్ డౌన్ లో దిగిన శ్రీకర్ భరత్
  • 16 పరుగులకే అవుట్
  • 63 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బెంగళూరు
ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, ఏదీ కలిసిరాలేదు. ఆ జట్టు 63 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, నేటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు తరఫున ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శ్రీకర్ భరత్ బరిలో దిగాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ (5) అవుటైన తర్వాత భరత్ కు వన్ డౌన్ లో ఆడే అవకాశం లభించింది. అయితే ఆ చాన్స్ ను భరత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు 19 బంతులాడి ఒక ఫోర్ సాయంతో 16 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన భరత్... లెగ్ సైడ్ ఆడబోయి శుభ్ మాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

జట్టు పరంగా చూస్తే భరత్ చేసిన 16 పరుగులు ఎంతో విలువైనవిగా భావించాలి. కోల్ కతాపై ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 22 పరుగులు చేయగా, ఆ తర్వాత భరతే అత్యధిక రన్స్ స్కోర్ చేశాడు. మ్యాక్స్ వెల్ 10 పరుగులకే అవుట్ కాగా, ఏబీ డివిలియర్స్, హసరంగ డకౌట్ అయ్యారు. సచిన్ బేబీ 7 పరుగులు చేశాడు.


More Telugu News