విమానాలు లేకపోవడంతో ఒంటరిగా పడవలో 6 వేల కిలోమీటర్ల ప్రయాణం
- చివరకు ఆస్ట్రేలియా చేరిన బ్రిటన్ పౌరుడు
- రెసిడెన్సీ వీసా పొడిగించుకోవాల్సిన అవసరం
- కరోనా కారణంగా రద్దయిన విమానాలు
- సాహసోపేతమైన నిర్ణయంతో తన పడవలో ఒంటరిగా ప్రయాణం
కరోనా మహమ్మారి ప్రపంచంలో చాలా మందికి వింత అనుభవాలు మిగిల్చింది. వాటిలో కొన్ని విషాదాంతాలు కాగా, మరికొన్ని సాహసోపేతమైనవి. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. బ్రిటన్‌కు చెందిన పాల్ స్ట్రాఫోల్డ్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కరోనా కారణంగా అతను తాహితిలో ఇరుక్కుపోయాడు.
స్వదేశం వెళ్లడానికి విమానాలు లేవు. దీంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. చివరకు కఠిన నిర్ణయం తీసుకొని తన 50 అడుగుల పడవలో ఒంటరిగా ఆస్ట్రేలియా పయనమయ్యాడు. ఈ ప్రయాణం 6 వేల కిలోమీటర్లు సాగింది. మధ్యలో తుపాను రావడంతో పాల్ ప్రాణాలు పోయినంతపనైంది.
పడవ బోల్తా అవకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తను కొన్నిసార్లు రోజుకు 40 నిమిషాలు మాత్రమే నిద్రపోయినట్లు పాల్ చెప్పాడు. 41 ఏళ్ల పాల్ ఇలా రెండు నెలలపాటు సముద్రంలో ప్రయాణించాడు. ఇలా జూలై 3 నాటికి చివరికి క్వీన్స్‌ల్యాండ్ చేరుకున్నాడు. ‘ఇంటికి చేరుకోవడానికి ఇంతకుమించి వేరే మార్గం కనిపించలేదు’ అని చెప్పాడు.
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కరోనా మహమ్మారి వల్ల విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. అవి ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆస్ట్రేలియాలో విమాన సర్వీసులను గురువారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.