అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన టాలీవుడ్ నటుడు అడివి శేష్
- డెంగీ జ్వరంతో బాధపడుతున్న అడివి శేష్
- బాగా పడిపోయిన ప్లేట్ లెట్ల సంఖ్య
- దెబ్బతిన్న ఆరోగ్యం
- ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
టాలీవుడ్ నటుడు అడివి శేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల కింద అడివి శేష్ కు జ్వరం రాగా, వైద్య పరీక్షల్లో డెంగీ అని తేలింది. గత వారం ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోయినట్టు గుర్తించారు. దాంతో ఈ నెల 18న ఆయనను హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన డాక్టర్ల బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి-2, హిట్-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. గతంలో హిట్టయిన గూఢచారి, హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతుండగా, ఆ రెండు చిత్రాల్లో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు.
అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి-2, హిట్-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. గతంలో హిట్టయిన గూఢచారి, హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతుండగా, ఆ రెండు చిత్రాల్లో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు.