పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్ జిత్ సింగ్
- చరణ్ జిత్ కు డిప్యూటీలుగా ఇద్దరు ప్రమాణస్వీకారం
- ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ
- మరో నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా పంజాబ్ సీఎంగా బాధ్యతలను చేపట్టిన తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రపుటల్లోకి ఎక్కారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు.
మరో నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర సీఎంను కాంగ్రెస్ పార్టీ మార్చడం గమనార్హం. గత ఆరు నెలలుగా మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య తీవ్ర వివాదం కొనసాగింది. ఇది పార్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని భావించిన హైకమాండ్ ను అమరీందర్ ను మార్చేసింది. మరి ఈ మార్పు కాంగ్రెస్ కు ఏ మేరకు కలిసొస్తుందో వేచి చూడాలి.