చిన్న వయసులోనే ఎంపీటీసీగా గెలుపొందిన అమ్మాయి
- పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన షహీల
- ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానంలో గెలుపు
- ప్రత్యర్థిపై ఆమె 557 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిన్న జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడేనికి చెందిన మానుకొండ షహీల (21) చిన్న వయసులోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు.
ఆమెను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహా పలువురు అభినందించారు. డిగ్రీ పూర్తి చేసిన షహీలకు ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి జరిగింది. ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఆమె పోటీ చేసింది. ప్రత్యర్థిపై ఆమె 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.