టీటీడీ సామాన్య భక్తులకు శుభవార్త.. సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు
- ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికే సర్వదర్శనం టోకెన్లు
- రోజుకు ఇకపై 8 వేల టికెట్లు జారీ చేయాలని నిర్ణయం
- పెరటాసి నెలకావడంతో భక్తుల నుంచి డిమాండ్
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు ఇది శుభవార్తే. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వారికే పరిమితమైన సర్వదర్శన భాగ్యం ఇకపై అందరికీ కలగనుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికి రోజుకు 2 వేల టికెట్లను జారీ చేస్తుండగా, ఇకపై వాటి సంఖ్యను 8 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాక, అన్ని ప్రాంతాల వారికి దర్శనానికి అవకాశం కల్పించింది.
పెరటాసి నెలకావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సర్వదర్శనం కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఏ రోజు టికెట్లను ఆ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు.