రామ్ చరణ్ ఇటీవల కొన్న కొత్త కారు ప్రత్యేకతలు ఇవే!
- రామ్ చరణ్ గ్యారేజిలో కొత్త కారు
- మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 కొనుగోలు
- ఇటీవలే కారును చరణ్ కు అప్పగించిన మెర్సిడెస్
- చరణ్ అభిరుచులకు అనుగుణంగా మార్పులు
టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోగా ఎదిగిన రామ్ చరణ్ కు కార్లంటే మోజు అని తెలిసిందే. చరణ్ గ్యారేజిలో అనేక విదేశీ కార్లు ఉన్నాయి. కొన్నిరోజుల కిందటే ఆ జాబితాలో కొత్త కారు వచ్చి చేరింది. అది మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 మోడల్ కారు. దీని ఖరీదు అక్షరాలా రూ.2.43 కోట్లు (ఎక్స్ షోరూం).
ఇటీవల మెర్సిడెస్ సంస్థ సిబ్బంది ఈ అల్ట్రామోడ్రన్ ఎస్ యూవీని రామ్ చరణ్ కు నేరుగా సెట్స్ పైకి తీసుకువచ్చి అందించారు. రామ్ చరణ్ తన అభిరుచుల మేరకు ఈ కారుకు కొన్ని సూచనలు చేయగా, మెర్సిడెస్ సంస్థ ఆమేరకు మార్పులు చేర్పులు చేసింది. దాంతో కారు ఖరీదు కాస్తా రూ.4 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. హైఎండ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 కచ్చితంగా ముందువరుసలో నిలుస్తుంది.
రామ్ చరణ్ కొన్న మెర్సిడెస్ ప్రత్యేకతలు ఏంటంటే...

- మోనోటోన్ కవాన్సైట్ బ్లూ షేడ్ కలర్ లో కాంతులీనుతున్న కారు.
- కారులో 4 ఇండివిడ్యువల్ సీట్లు. లగ్జరీ, కంఫర్ట్ కు పెద్దపీట.
- డ్యూయల్ టోన్ బ్రౌన్ ఇంటీరియర్. కారు లోపలి భాగంలో అత్యంత నాణ్యమైన నప్పా లెదర్ వినియోగం.
- రిక్లైనింగ్ రియర్ సీట్లు, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ మసాజ్ సీట్లు.
- పరిస్థితులకు తగిన విధంగా లైటింగ్ ను అడ్జస్ట్ చేసుకునే సదుపాయం.
- 12.3 అంగుళాల లేటెస్ట్ ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్.
- హేయ్ మెర్సిడెస్ వాయిస్ కమాండ్ వ్యవస్థ, మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్ సహితం.
- 4 లీటర్ బీఐ టర్బో వీ8 ఇంజిన్. 9జీ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్.
- అత్యుత్తమ పికప్ కోసం 48 వోల్ట్ ఈక్యూ బూస్ట్ సిస్టమ్.
- కేవలం 4.9 సెకన్లలోనే 100 కిమీ వేగం, టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.