పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపిక
- సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
- ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ పార్టీ
- ఓ ఎస్సీ నేతకు సీఎం పదవి
- చన్నీ ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందన్న హరీశ్ రావత్
కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, తదుపరి సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఏకగ్రీవంగా ఎంపికైనట్టు స్పష్టం చేశారు.
చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చన్నీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం సామాజిక న్యాయం పాటించినట్టయింది. కాగా, చన్నీ ఎంపికపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ కాసేపట్లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలవనున్నారు.