బ్యాలెట్ బాక్సులో మందుబాబు చీటీ.... ఏం రాశాడంటే!
- నేడు ఏపీలో పరిషత్ ఓట్ల లెక్కింపు
- అనంతపురం జిల్లాలో ఘటన
- మందుబాబు విజ్ఞప్తితో ఆశ్చర్యపోయిన అధికారులు
- మంచి బ్రాండ్లు అమ్మాలన్న మందుబాబు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లిలో కౌంటింగ్ జరుగుతుండగా, ఓ బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు ఓ చీటీ కూడా దర్శనమిచ్చింది. అది చదివిన కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు.
అది ఓ మందుబాబు రాసిన చీటీగా గుర్తించారు. రకరకాల మద్యం బ్రాండ్లతో విసిగిపోయామని తెలిపారు. నల్లచెరువు వైన్ షాపులో మంచి బ్రాండ్లు పెట్టాలని, కూలింగ్ ఉన్న బీర్లు అందుబాటులో ఉంచాలని ఆ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. ఇట్లు... నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడు అని లేఖలో పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన ఓటుతో పాటు ఈ చీటిని కూడా బ్యాలెట్ బ్యాక్సులో వేశాడు.