ఖైరతాబాద్ మహా రుద్రగణపతి జలప్రవేశం... ట్యాంక్ బండ్ వద్ద పూర్తయిన నిమజ్జనం
- గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపతి
- ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం
- క్రేన్-4 ద్వారా జలప్రవేశం చేసిన గణపయ్య
- హర్షం వ్యక్తం చేసిన భక్తులు
వినాయకచవితి సందర్భంగా యావత్ తెలంగాణకే తలమానికంగా నిలిచే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయింది. పంచముఖ మహా రుద్రగణపతి హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద కొద్దిసేపటి కిందట జలప్రవేశం చేశాడు. ఆ భారీ గణపయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరడంతో అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ఖైరతాబాద్ గణపతిని ట్యాంక్ బండ్ పై ఉన్న క్రేన్-4 ద్వారా నిమజ్జనం చేశారు. భారీ కొక్కేలకు తగిలించిన వినాయకుడిని నిదానంగా హుస్సేన్ సాగర్ నీటిలోకి దించారు. విగ్రహం పూర్తిగా మునగడంతో నిమజ్జనం పూర్తయింది.