కాసేప‌ట్లో ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి విగ్ర‌హ నిమ‌జ్జ‌నం: త‌ల‌సాని

  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన త‌ల‌సాని
  • అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం
  • వీలైనంత త్వ‌ర‌గా నిమ‌జ్జ‌నం ముగిసేలా చ‌ర్య‌లు
రాష్ట్ర వ్యాప్తంగా గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం ప్ర‌శాంతంగా కొనసాగుతోందని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను త‌ల‌సాని ప‌రిశీలించారు. అనంత‌రం హుస్సేన్ సాగ‌ర్‌లో బోటులో తిరిగారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాసేప‌ట్లో ఖైరతాబాద్ గ‌ణ‌ప‌తి విగ్ర‌హం నిమ‌జ్జ‌నం ముగుస్తుంద‌ని చెప్పారు.

మ‌రోవైపు, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ... గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌ధాన ప్రాంతాల్లో ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. పోలీసు స్టేష‌న్ల‌కు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామ‌ని చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా నిమ‌జ్జ‌నం ముగిసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 10 అడుగులలోపు ఎత్తు ఉన్న విగ్ర‌హాల‌ను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు నుంచి ట్యాంక్స్ బండ్‌కు త‌ర‌లిస్తున్నామ‌ని తెలిపారు.




More Telugu News