రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల నేతల కీలక భేటీ
- హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సమావేశం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరుపై చర్చ
- పోరాటాలకు ప్రణాళికలు ఖరారు చేసే అవకాశం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరు, వాటి ప్రజా వ్యతిరేక విధానాలపై నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ప్రణాళికలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, ప్రతిపక్షాల ఉమ్మడి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేతల సమావేశంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, బాలమల్లేశ్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.