మహారాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డ హీరోయిన్ కంగన
- థియేటర్లను తెరవడానికి అనుమతులు ఎందుకు ఇవ్వరు?
- దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది
- అనేక రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి
- మహారాష్ట్ర సర్కారు వివక్ష చూపుతోంది
మహారాష్ట్ర ప్రభుత్వంపై హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరవడానికి అనుమతులు ఇవ్వకపోవడం సరికాదని ఆమె అన్నారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయని ఆమె చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించపోవడం సరికాదని, సినీరంగంపై ఆ రాష్ట్ర సర్కారు వివక్ష చూపుతోందని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయని ఆమె అన్నారు. థియేటర్లు తెరవడానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోందని ఆరోపించారు.
మహారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడకపోవడం శోచనీయమని చెప్పారు. కాగా, కంగనా రనౌత్ నటించిన ‘తలైవి’ సినిమా విడుదల నేపథ్యంలోనూ మహారాష్ట్రలో ప్రభుత్వం థియేటర్లను తెరవడానికి అనుమతులు ఇవ్వలేదు.