సిద్ధూకు పాక్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ తో స్నేహం ఉంది.. అతడు సీఎం అయితే దేశానికే ముప్పు: అమరీందర్ సింగ్
- పంజాబ్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం
- సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
- 'సిద్ధూ సీఎం' ప్రతిపాదన తిరస్కరిస్తానని వెల్లడి
- దేశానికి విపత్తులాంటివాడని వ్యాఖ్యలు
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్... రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై విరుచుకుపడ్డారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించిన అమరీందర్ మీడియాతో మాట్లాడారు. సిద్ధూకు పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని, అతడు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే దేశ భద్రతకే ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్ధూకు పాక్ ప్రధానితోనూ, పాక్ ఆర్మీ చీఫ్ తోనూ స్నేహం ఉందని ఆరోపించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ అసమర్థుడని, పంజాబ్ కు తదుపరి సీఎం సిద్ధూ అనే ప్రతిపాదన వస్తే కచ్చితంగా తిరస్కరిస్తానని అమరీందర్ స్పష్టం చేశారు. అతడు సీఎం పీఠం ఎక్కితే దేశానికే విపత్తుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.