టీడీపీ నేతలకు గవర్నర్​ అపాయింట్​ మెంట్​

  • చంద్రబాబు ఇంటి మీద దాడి ఘటనపై పిర్యాదు చేయనున్న నేతలు
  • సాయంత్రం 4 గంటలకు టైమిచ్చిన గవర్నర్
  • చంద్రబాబు ఇంటి వద్ద నిన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఘర్షణ
చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడికి సంబంధించి టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు వారు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరగా.. ఆయన ఖరారు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ నేతలకు ఆయన అపాయింట్ మెంట్ ను ఇచ్చారు.

చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘర్షణపై పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్ కు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజా, అశోక్ బాబులతో కూడిన టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేయనుంది. కాగా, రాష్ట్ర మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంస్మరణ సభ సందర్భంగా టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలపై మండిపడిన ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలోని వైసీపీ కార్యకర్తలు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు కర్రలతో కొట్టుకున్నారు.


More Telugu News