తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లనున్న జగన్

  • అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • 11వ తేదీన గరుడవాహన సేవ
  • శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే నెల 11న తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమలలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 11వ తేదీ రాత్రి గరుడవాహన సేవ జరగనుంది. ఈ సేవ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

అదే రోజు తిరుమలలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ పోటును ప్రారంభిస్తారు. అలిపిరి వద్ద రూ. 13 కోట్లతో నిర్మించిన గో మందిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అదనపు పోటుకు రూ. 20 కోట్లను టీటీడీ పాలకమండలి సభ్యుడు శ్రీనివాసన్, గోమందిరంకు రూ. 13 కోట్ల విరాళాన్ని మాజీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి అందించారు.


More Telugu News