జీఎస్టీ సమావేశంలో హరీశ్ రావు.. నిధుల విడుదల కోసం కేంద్రానికి వినతి

  • నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందించిన హరీశ్ రావు
  • లక్నో వేదికగా జరిగిన 45వ జీఎస్టీ సమావేశం
  • రూ. 210 కోట్ల ఐజీఎస్టీ నిధులు విడుదల చేయాలన్న మంత్రి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జీఎస్టీ మండలి 45వ సమావేశం జరుగుతోంది. దీనిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి రావలసిన ఐజీఎస్టీ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన కోరారు. ఐజీఎస్టీ పరిహారంలో తెలంగాణకు రూ.210 కోట్ల నిధులు రావలసి ఉంది.

అలాగే తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరిగిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను 9 జిల్లాలకు కాకుండా హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలకు ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. అలాగే ఈ నిధులను 2021-22 నుంచి మరో ఐదేళ్లపాటు అందించాలని అడిగారు.

అలాగే బీఆర్జీఎఫ్ నిధులను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలన్నారు. ఇక 2020-21లో 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్ల గ్రాంటును కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ అందించారు.


More Telugu News