బనకచర్ల ప్రాజెక్టు కృష్ణా బోర్డు పరిధిలోనే ఉండాలంటున్న తెలంగాణ
- కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం
- ప్రాజెక్టుల వివరాలు సమర్పించాలన్న ఉపసంఘం
- బనకచర్ల కృష్ణా బోర్డు పరిధిలోకి రాదన్న ఏపీ ప్రభుత్వం
- వ్యతిరేకించిన తెలంగాణ
హైదరాబాదులో నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 10 రోజుల్లోగా ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ప్రాజెక్టులకు సంబంధించి రూ.1 కోటికి పైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు ఇవ్వాలని కోరింది. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాక సీఆర్పీఎఫ్ పై చర్చ ఉంటుందని ఉపసంఘం వెల్లడించింది.
కాగా, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కృష్ణా బోర్డు పరిధిలోకి రాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో, తెలంగాణ గట్టిగా స్పందిస్తూ, బనకచర్ల కూడా కృష్ణా బోర్డు పరిధిలోనే ఉండాలని పట్టుబట్టింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న కృష్ణా బోర్డు కన్వీనర్ పిళ్లై... అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు.