మోదీ, షా ద్వయం గుజరాత్‌లో మంచి ప్రయోగం చేసింది: దిగ్విజయ్ సింగ్ చురకలు
- ఎన్నికల ముందు చర్యలు
- అక్రమాలకు పాల్పడేందుకు మంత్రులకు అవకాశం
- పరిస్థితులు సజావుగా ఉన్నాయనే సంకేతం ఇవ్వాలనుకున్నారు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలను బీజేపీ అధిష్ఠానం తీసుకోవడంతో దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ, షా ద్వయం గుజరాత్‌లో మంచి ప్రయోగం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు రాష్ట్రంలో బాగా అక్రమాలకు పాల్పడేందుకు మంత్రులకు అవకాశం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
అదే సమయంలో ఎన్నికలకు ముందు కొత్త ముఖాలను తీసుకువచ్చి రాష్ట్రంలో అన్ని పరిస్థితులు సజావుగా ఉన్నాయనే సంకేతం ఇవ్వాలనుకున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో మరి ప్రక్షాళన ఎప్పుడని ఆయన ప్రశ్నించారు.