అప్పుడే పీకేని జగన్ రంగంలోకి దించుతారట: బుద్ధా వెంకన్న ఎద్దేవా
- మంత్రివర్గ భేటీలో దీనిపైనే చర్చ
- ప్రజల సమస్యల గురించి చర్చించలేదు
- పీకే కాదు పై నుంచి రాజారెడ్డి దిగొచ్చినా ఏం చేయలేరు
- ప్రజలు చంద్రబాబుపైనే ఆశలు పెట్టుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ కు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. అప్పుడే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పిలిచేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని ఆయన చెప్పారు.
'మంత్రి వర్గ సమావేశంలో ప్రజల గురించి చర్చించకుండా పీకేను రంగంలోకి దించాలన్న విషయంపై చర్చించారు. వచ్చే మార్చి నుంచే పీకేను రంగంలోకి దించాలని అన్నారు. మంత్రి వర్గ సమావేశంలో మొత్తం దీనిపైనే చర్చ జరిగింది. మంత్రులకు ఈ అంశంపైనే జగన్ వివరించారు. పీకే కాదు పై నుంచి మీ తాత రాజారెడ్డి దిగొచ్చినా సరే తెలుగు దేశం విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. నవరత్నాల పేరుతో మోసం చేశారు. రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు?' అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
'విద్యార్థులు, మహిళలు, రైతులు ఎవ్వరూ బాగుపడలేదు. చంద్రబాబు నాయుడి మీదే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ ఎప్పుడు అధికారంలోకి వస్తారన్న అంశంపైనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేసే సామర్థ్యం వేరెవ్వరికీ లేదు. టీడీపీకి పీకే వంటి వారు అవసరం లేదు. ఎన్నికల్లో చంద్రబాబు ఫొటో పెట్టుకుంటే చాలు టీడీపీ అభ్యర్ధులంతా గెలుస్తారు. వైసీపీ మాటలు నమ్మి మోసపోయేందుకు రాష్ట్ర ప్రజలు మళ్లీ సిద్ధంగా లేరు' అని బుద్ధా వెంకన్న అన్నారు.