'రిపబ్లిక్' రిలీజ్ వాయిదా పడలేదట!

  • దేవ కట్టా రూపొందించిన 'రిపబ్లిక్'
  • అవినీతి రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
  • అక్టోబర్ 1వ తేదీన విడుదల  
సాయితేజ్ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. పరిస్థితులు అనుకూలంగా మారడంతో, ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఇటీవల సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు.

ఇప్పుడు ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనే పరిస్థితి లేకపోవడం వలన, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాను ముందుగానే జీటీవీ సంస్థవారు తీసుకున్నారట. సినిమా మార్కెట్ ను వాళ్లే చూసుకుంటున్నారట. అందువలన ముందుగా చెప్పిన ప్రకారమే ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన థియేటర్లకు తెచ్చేస్తున్నారని అంటున్నారు. ప్రమోషన్స్ లో దర్శకుడు దేవ కట్టాతో పాటు, కీలకమైన పాత్రలను పోషించిన రమ్యకృష్ణ .. జగపతిబాబు పాల్గొంటారని చెప్పుకుంటున్నారు.


More Telugu News