ఈ పోరాటంలో అసువులు బాసిన ప్రతి వీరునికి నివాళులు: షర్మిల
- తెలంగాణ విమోచన దినం సందర్భంగా ట్వీట్
- నాటి పరిస్థితులను గుర్తు చేసిన షర్మిల
- తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజుని వ్యాఖ్య
తెలంగాణ విమోచన దినం సందర్భంగా నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఆ పోరాటంలో అసులు బాసిన వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పాటను పోస్ట్ చేశారు.
'బాంచన్ దొర అని సలాంలు కొట్టిన చేతులే బందూకులు, బడిసెలు పట్టుకొని భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరు సలిపి, రజాకార్లను తరిమికొట్టి, తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు నేడు. ఈ పోరాటంలో అసువులు బాసిన ప్రతి వీరునికి నివాళులు' అని ఆమె పేర్కొన్నారు.