'మాచర్ల నియోజకవర్గం'లో చేరిన నిధి అగర్వాల్!

'మాచర్ల నియోజకవర్గం'లో చేరిన నిధి అగర్వాల్!
  • తొలి రెండు సినిమాలు ఫ్లాప్
  • 'ఇస్మార్ట్ శంకర్'తో దొరికిన హిట్
  • తమిళంలోను బిజీ
  • తెలుగులో పెరుగుతున్న అవకాశాలు  
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో నిధి అగర్వాల్ కూడా కనిపిస్తుంది. చక్కని కనుముక్కు తీరుతో ఈ సుందరి యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే 'సవ్యసాచి' .. 'మిస్టర్ మజ్ను' సినిమాలు నిరాశపరచడం వలన, 'ఇస్మార్ట్ శంకర్' హిట్ వరకూ వెయిట్ చేయవలసి వచ్చింది.

'ఇస్మార్ట్ శంకర్'లో అందాల ఆరబోత తరువాత తమిళ సినిమాల వైపు దృష్టి పెట్టింది. అక్కడ ఆమె ప్రయత్నాలు ఫాస్టుగానే ఫలించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాలోను అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇక తాజాగా నితిన్ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందుతోంది. శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. మరో కథానాయికగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. చూస్తుంటే తెలుగులో నిధి జోరు పెరగనున్నట్టే అనిపిస్తోంది.


More Telugu News