మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్... తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

  • త్వరలో ముగియనున్న వైన్ షాపుల కాలపరిమితి
  • కొత్త వైన్ షాపులకు త్వరలోనే టెండర్లు
  • గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ టీఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్ షాపుల కాలపరిమితి త్వరలోనే ముగియబోతోంది.

ఈ నేపథ్యంలో త్వరలోనే మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానించబోతున్నారు. ఈ టెండర్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున షాపులను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరోవైపు దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా మద్యం షాపుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News