టీ20 కెప్టెన్ గా తప్పుకుంటున్న కోహ్లీ.. తదుపరి కెప్టెన్ గా ఎవరు బెస్ట్ అనే అంశంపై గవాస్కర్ స్పందన
- వర్క్ లోడ్ తో టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కోహ్లీ
- రోహిత్ ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ అనుకుంటోందన్న గవాస్కర్
- భవిష్యత్తు దృష్ట్యా కేఎల్ రాహుల్ ను కెప్టెన్ చేయాలని సూచన
యూఏఈలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 ఫార్మాట్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పని భారాన్ని తగ్గించుకోవడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. రవిశాస్త్రి, రోహిత్ శర్మతో పాటు జట్టు సభ్యులతో చర్చించిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. కోహ్లీ ఈ ప్రకటన చేసిన వెంటనే కాబోయే టీ20 కెప్టెన్ ఎవరనే చర్చ మొదలయింది.
ఈ అంశంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ... తనకు కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడని చెప్పారు. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావిస్తోందని... ఈ నేపథ్యంలో రాహుల్ ను కనీసం వైస్ కెప్టెన్ చేయాలని బీసీసీఐకి సూచించారు. రోహిత్ వయసు 35 ఏళ్లని... ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. యువకుడైన కేఎల్ రాహుల్ ను కెప్టెన్ చేస్తే... భవిష్యత్తులో అతను జట్టును సమర్థవంతంగా నడపగలడని అన్నారు.