టీటీడీ బోర్డు ఏర్పాటు విష‌యంపై జగన్ కు చంద్రబాబు లేఖ

  • బోర్డు ఏర్పాటు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమే
  • రాజకీయ, వ్యాపార స్వార్థ‌ ప్రయోజనాల కోసమే ఏర్పాటు
  • అవినీతి పరులతో పాటు నేర చరిత్ర కలిగిన వారున్నారు
టీటీడీ బోర్డు ఏర్పాటు విష‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 81 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమేనని ఆయ‌న చెప్పారు. రాజకీయ, వ్యాపార స్వార్థ‌ ప్రయోజనాల కోసమే బోర్డును ఏర్పాటు చేశార‌ని ఆయ‌న అన్నారు.  

బోర్డులో అవినీతి పరులతో పాటు నేర చరిత్ర కలిగినవారు ఉన్నారని చంద్ర‌బాబు ఆరోపించారు. రెండేళ్లలో తిరుమల కొండపై అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని ఆయ‌న చెప్పారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తన నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకుని, బోర్డును రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.


More Telugu News