డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన శారదక్క
- ఆమె మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ భార్య
- ఆయన కొన్ని నెలల క్రితమే కరోనాతో భర్త మృతి
- శారదక్కకు అనారోగ్యం
- మధ్యాహ్నం మీడియాకు వివరాలు తెలపనున్న డీజీపీ
మావోయిస్టు కీలక నాయకురాలు బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క ఈ రోజు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆమె మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ భార్య. ఆయన కొన్ని నెలల క్రితమే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం శారదక్క కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మావోయిస్టు పార్టీ చర్ల, శబరి ఏరియా కమిటీ మెంబర్ గా, డీసీఎం కమిటీ సభ్యురాలిగానూ శారదక్క ఉన్నారు. ఆమె స్వస్థలం మహబూబాబాద్ జిల్లాలోని గంగారం. పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితురాలై, 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు. శారదక్క లొంగుబాటుకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో వెల్లడిస్తారు.