నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత కోర్టుకు వచ్చిన మాజీ అధికారి రాజగోపాల్
- జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ
- ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజగోపాల్
- గైర్హాజరయ్యారంటూ కోర్టు ఆగ్రహం
- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- వారెంట్ జారీ అయ్యాక కోర్టుకు వచ్చిన రాజగోపాల్
జగన్ అక్రమాస్తుల కేసులలో భాగంగా రాంకీ ఫార్మా, ఓఎంసీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారులకు నేడు సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం తెలిసిందే. రాంకీ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి, ఓఎంసీ కేసులో గనులశాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్ కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వీరిద్దరూ విచారణకు గైర్హాజరవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం జరిగింది. నేడు వారెంట్ జారీ చేసిన కాసేపటి తర్వాత రాజగోపాల్ కోర్టుకు వచ్చారు. దాంతో ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను సీబీఐ కోర్టు ఉపసంహరించుకుంది. అయితే రూ.5 వేలకు వ్యక్తిగత ష్యూరిటీ చెల్లించాలని రాజగోపాల్ ను న్యాయస్థానం ఆదేశించింది.